Home  »  TV News  »  Bigboss Agnipariksha season 2: అదరగొట్టిన కంటెస్టెంట్లు.. నేరుగా టాప్ 15లోకి దూసుకెళ్లిన చరణ్!

Updated : Aug 18, 2026

బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కామనర్స్ అగ్నిపరీక్ష నీ ఎదురుకోవాల్సిందే.. అందుకోసమే మొన్నటి నుండి అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలైంది. దానికి జూరీస్ గా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఉన్నారు. హోస్ట్ గా శ్రీముఖి ఉండగా.. నిన్న జరిగిన అగ్నిపరీక్ష ఎపిసోడ్ లో మొదటి పార్టిసిపేట్ చరణ్ వచ్చాడు. అతను నిజమాబాద్ నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో శ్రీముఖి బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళది కూడా నిజామాబాద్ కాబట్టి.ఇక తన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు చరణ్. నేను విన్నర్ కావాలి అలాగే నెక్స్ట్ సీజన్ కి నేనే బజ్ హోస్ట్ కావాలని చరణ్ చెప్తాడు. సరే మమ్మల్ని ఒక్కొక్కరిగా కొన్ని క్వశ్చన్స్ అడుగమని శ్రీముఖి అంటుంది. దాంతో చరణ్ నలుగురిని బజ్ లాగా ఇంటర్వ్యూ చేశాడు. తను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. దానికి ముగ్గురు జ్యూరీస్ ఇంప్రెస్ అయి గ్రీన్ ఇచ్చారు. దాంతో చరణ్ డైరెక్ట్ టాప్-15 కి వెళ్ళిపోయాడు.

 

నెక్స్ట్ పార్టిసిపేట్ బేబ్జాన్ వచ్చింది. తను ఓంగోల్ నుంచి వచ్చింది. తన మాటలతో జ్యూరీస్ ని ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. ముగ్గురు రెడ్ ఇస్తారు. ఒక అమ్మాయి బోల్డ్ గా మాట్లాడితే ఎవరికి నచ్చదని ఆ అమ్మాయి అంటుంది. ఐ హేట్ జడ్జిమెంట్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది.ఇక మధ్యలో కొంతమంది వచ్చి మెరుపు తీగలాగా వెళ్లిపోయారు. నెక్స్ట్ పార్టిసిపేట్ గా అమన్ వస్తాడు. తనకి యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్తాడు. దాంతో యాక్టింగ్ చేసి చూపించమంటారు జడ్జెస్. అతను చేసిన యాక్టింగ్ కి జడ్జెస్ ఇంప్రెస్ అవుతారు.ఇద్దరు జ్యూరీస్ గ్రీన్ ఇస్తారు. బిందు మాధవి మాత్రం రెడ్ ఇస్తుంది.

 

నెక్స్ట్ పార్టిసిపేట్ గా సిద్దిపేట్ నుంచి సుమ వచ్చింది. చక్కగా ట్రెడిషన్ గా రెడీ అయి వచ్చేసింది.. చాలా క్యూట్ ఉన్నావని శ్రీముఖి పొగుడుతుంది. తనకి ఒక టాస్క్ ఇస్తారు. అభిజిత్, నవదీప్ గ్రీన్ ఇస్తారు. బిందు మాధవి మాత్రం రెడ్ ఇస్తుంది. నెక్స్ట్ పార్టిసిపేట్ గా అక్షయ్ రాజ్ వస్తాడు. తను మాట్లాడుతుంటేనే జ్యూరీస్ చికాకుగా ఫీల్ అవుతారు. ముగ్గురు రెడ్ ఇచ్చి పంపిస్తారు. నెక్స్ట్ పార్టిసిపేట్ గా హైదరాబాద్ నుంచి గాయత్రి వస్తుంది. తనకి నవదీప్, అభిజిత్ గ్రీన్ ఇస్తారు. బిందు రెడ్ ఇస్తుంది. నెక్స్ట్ పార్టీసీపేట్ గా రుచిత వస్తుంది. ఇద్దరు గ్రీన్ ఇస్తారు. ఒకరు రెడ్ ఇస్తారు. ఇలా ఎపిసోడ్ లో ఒకరు డైరెక్ట్ టాప్ 15 లోకి ఛాన్స్ కొట్టేసారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.